ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

Men Raped On 8 Years Old

నిర్భయ, దిశ వంటి ఎన్ని చట్టాలు వచ్చినా మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. జగిత్యాల జిల్లాలో  దారుణం జరిగింది.  ఎనిమిదేళ్ల చిన్నారిపై  మామ వరసయ్యే ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.  ఈ విషయం గుర్తించిన చిన్నారి బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేడిపల్లి మండలం పసునూరు గ్రామంలో గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారుల్లో 8 ఏళ్ల ఓ చిన్నారిని గంగా రెడ్డి అనే సఫాయి తీసుకెళ్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో అత్యాచారం చేశాడు. ఆ చిన్నారికి  అతడు మామ వరస అవుతాడు. ఘటన జరిగిన తర్వాత ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు గంగారెడ్డిని అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం చిన్నారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Men Raped On 8Years Old, jagityal, pasunuru, eight years old girl , rape, police station, complaint , arrest

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article