ముద్దు లాటలకీ అడ్డా మెట్రో స్టేషన్లు

Metro Stations for Lovers LIP LOCKs

ఇందిరాపార్క్‌, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు మొన్నటి వరకు హైదరాబాద్‌లో లవర్స్‌కు అడ్డాలు. మెట్రో వచ్చాక ప్రేమ పక్షలు స్పాట్‌ మార్చాయి. పార్కుల నుంచి ఎగిరొచ్చి మెట్రో స్టేషన్స్‌కు చేరుకుంటున్నాయి. వాలంటైన్స్‌ డే కు మరో వారం రోజులు ఉండగానే మెట్రో స్టేషన్స్‌ను రొమాన్స్‌ స్పాట్స్‌గా మార్చేశాయి.

మెట్రో స్టేషన్లలో ఉన్న లిఫ్టులను కూడా లవర్స్‌ వదలడం లేదు. వృద్ధులు, నడవలేని వారి కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లను లిప్‌ లాకింగ్‌‌కు స్పాట్స్‌గా మార్చేశాయి. ప్రేమికులు ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నారు. మెట్రో రైలు లిఫ్టులో జరిగిన అసాంఘిక కార్యక్రమాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఈ దృశ్యాలను చూసిన అధికారులు ఖంగుతిన్నా,రు. వృద్ధుల కోసం, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన మెట్రో రైలు లిఫ్టుల్లో ఇలాంటి అరాచక కార్యక్రమాలు జరుగుతుండడం చూసి ముక్కున వేలేసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భాగ్యనగర వాసులు సౌకర్యార్థం మెట్రో రైళ్లను ఏర్పాటు చేస్తే, వృద్ధులు వికలాంగులకు అవసరం కోసం లిఫ్ట్ లను ఏర్పాటు చేస్తే ఇక రైళ్లను, లిఫ్టులను లవర్స్ యథేచ్ఛగా వాడేసుకుంటున్నారు. ఒకపక్క బజరంగ్ దళ్ వాళ్ళు ప్రేమికులు కనిపిస్తే పెళ్లి చేస్తామని పార్కుల వెంట పడితే, పార్కులో ఉన్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని లవర్స్ మెట్రో స్టేషన్లను చేరుకుంటున్నారు . దీనితో తలలు పట్టుకోవడం అధికారుల వంతవుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article