తిరుమ‌ల‌కు మెట్రో ట్రైన్‌

174
Metro Rail planned for Tirumala
Metro Rail planned for Tirumala

Metro Rail Planned For Tirumala

తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో రైలును ఏర్పాటు చేయ‌డానికి మూడు రోజులు స‌ర్వే చేశామ‌ని హైద‌రాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. తిరుమ‌ల మొత్తం రిజ‌ర్వు ఫారెస్టు కింద డిక్లేర్ చేశార‌న్నారు. అందుకే, తిరుమ‌ల జ‌ర్నీకి మంచి ప‌రిష్కారం తీసుకొస్తామ‌ని చెప్పారు. అక్క‌డ కాలుష్యం త‌గ్గించేందుకు త‌గిన చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని సూచించారు. తిరుప‌తికి ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అభిప్రాయ‌ప‌డ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని, తిరుమల ప్రాజెక్టు పై నిర్ణయం తీసుకుంటే.. ప్రయత్నాలు మొదలవుతాయ‌న్నారు.
పాత బస్తీలో 5 కిలోమీటర్లు కట్టడానికి  ప్లాన్ చేస్తున్నాం

రెండో దశ లో ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పారు. రెండో దశలో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ 31 కిలోమీటర్లు …. లక్డీ కపూల్  నుంచి ఎయిర్పోర్ట్ కు  నూతన రూట్లు ప్లాన్ చేస్తున్నామ‌ని తెలిపారు. నాగోల్నుం చి ఎల్బీ నగర్ వరకు కూడా ఆలోచన ఉందన్నారు. రెండో దశ కోసం దిల్లి మెట్రో వారు డిపీఆర్ సిద్ధం చేశార‌ని వివ‌రించారు. ప్రయాణీకుల నుంచి L&T కి రోజుకు కోటి రూపాయల ఆదాయం వస్తుందని, మెట్రో మాల్స్ నుంచి నెలకు 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంద‌ని వెల్ల‌డించారు. టికెట్స్,  మాల్స్ నుంచి నెల కు L&T కి మొత్తం 40 కోట్ల రూపాయల ఆదాయం వ‌స్తుంద‌ని తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో కు 269 ఎకరాల భూమి ఇచ్చిందని.. ఎక్కువ సమయం పట్టింది… కాబట్టి నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 16 కోట్ల మంది మెట్రో లో ప్రయాణించార‌ని వెల్ల‌డించారు.

Metro Rail planned for Tirumala,#TIRUMALAMETROTRAIN,#CM JAGAN PLANS TO BUILD METRO TILL TIRUMALA,#AP GOVT NICE DECISION,#AP GOVT HISTORICAL DECISION,#TIRUMALA METRO TRAIN

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here