Sunday, November 24, 2024

కెటిఆర్‌కు ప్రభుత్వం తరఫున వైద్యం చేయిస్తాం

కెటిఆర్ ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటారా?
రాష్ట్ర ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

డ్రగ్స్‌వల్లో, తాగడం వల్లో కెటిఆర్ మెదడు చిన్నగా అవుతోందని రాష్ట్ర ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేతిలో ఫోన్ ఉంది కదా అని, మైక్ ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో ఏదీపడితే అది మాట్లాడుతున్నారన్నారు. డ్రగ్స్, తాగడం లాంటి వాటి వల్ల కెటిఆర్ మెదడు చిన్నగా అవుతోందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషికి అవార్డు వస్తే కెసిఆర్ వల్లే అవార్డు వచ్చిందని కెటిఆర్ అబద్ధాలు చెబుతున్నారని, కెటిఆర్ మెదడుకు చిల్లు పడితే సిఎం రేవంత్ రెడ్డి తో చెప్పి తమ ప్రభుత్వం తరఫున వైద్యం చేయిస్తామని ఆయన ఎద్దేవా చేశారు.

కెటిఆర్ తన జీవితంలో ఒక్కరోజైనా అబ ద్ధాలు చెప్పకుండా ఉంటారా? అని, అబద్దాల విషయంలో కెటిఆర్, హరీష్ రావుతో పోటీ పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ అబద్దాలు ఆడటంలో రికార్డు సాధించారని, ఆ రికార్డు బ్రేక్ చేసేందుకు కెటిఆర్ కష్టపడుతున్నారని ఆయన విమర్శలు చేశారు. ఇక సిఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధతో మహిళాభివృద్ధికి పథకం తీసుకొస్తే ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారా అని ఆయన మండిపడ్డారు. కెటిఆర్‌కు అవగాహన లోపం, సమాచార లోపం రెండు లేవని, దీనిపై పూర్తి సమాచారం కెటిఆర్ ఇంటి అడ్రస్‌కు పంపిస్తామని సాయికుమార్ వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular