మార్కెట్లోకి ఎంఐ షూస్

MI ENTRY IN FOOTWEAR

స్మార్ట్ ఫోన్ల రంగంలో భారత మార్కెట్లో దూసుకుపోతున్న చైనా కంపెనీ షావోమీ.. ఫుట్ వేర్ విభాగంలోకి కూడా ప్రవేశించింది. భారత్ లోని ఫుట్ వేర్ మార్కట్లో పాగా వేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎంఐ బ్రాండ్ ద్వారా ‘ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2’ పేరుతో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది.  వీటి ప్రారంభ ధర  రూ.2,499గా నిర్ణయించింది.  ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా  ప్రీ ఆర్డర్‌ చేసినవారికి మార్చి 15 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది. బ్లాక్‌, గ్రే, బ్లూ రంగుల్లో ఈ షూస్ లభ్యమవుతున్నాయి.  5 ఇన్‌ 1 మౌల్డింగ్‌ టెక్నాలజీ, 5 రకాల మెటీరియల్స్ లో మేళవించిన ఇంజనీరింగ్‌ టెక్నాలజీతో (షాక్‌ అబ్సార్బెంట్), జారకుండా, దీర్ఘకాలం మన్నేలా వీటిని రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఎంఐ టీవీలు, ఎయిర్‌ ప్యూరిఫైర్లు, మాస్కులు, సన్‌ గ్లాసెస్,  సూట్‌కేస్‌లను భారత మార్కెట్లో విడుదల చేసిన షోవోమీ.. తాజాగా యూత్ ను లక్ష్యంగా చేసుకుని ఈ షూస్ లాంచ్ చేసింది.

INTERNATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article