ఎంఐ నుంచి కొత్తగా రెండు టీవీలు

MI NEW TV’S

  • బడ్జెట్ ధరల్లో విడుదల చేసిన షావోమి

స్మార్ట్ ఫోన్ రంగంలోనే కాకుండా స్మార్ట్ టీవీ విభాగంలోనూ భారత్ లో దూసుకుపోతున్న చైనా దిగ్గజ కంపెనీ షావోమీ.. కొత్తగా మరో రెండు టీవీలను అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ 4ఏ సిరీస్ లో 4ఏ ప్రో 43 పేరుతో 43 అంగుళాల స్మార్ట్ టీవీతోపాటు 4ఎక్స్ ప్రో 55 పేరుతో 55 అంగుళాల 4కె టీవీని లాంచ్ చేసింది. 20 వాట్ల స్టీరియో స్పీక‌ర్లు, గూగుల్ వాయిస్ సెర్చ్,  షావోమి ప్యాచ్‌ వాల్‌ ప్రధాన ఫీచ‌ర్లుగా ఉన్న ఈ టీవీల్లో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఇందులో పొందపరిచారు. ప్లే స్టోర్‌, క్రోమ్, హాట్ స్టార్‌, హంగామా, సోనీ లివ్‌, వూట్‌, ఈరోస్ నౌ, జీ5, హూక్‌, ఎపిక్ ఆన్ వంటి యాప్‌లను వీటిలో ఇన్ బిల్ట్ గా పొందుపరిచింది. ఎంఐ 4ఎక్స్ ప్రో 55 టీవీలో 3840 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, డీటీఎస్ ఫీచర్లు ప్రధానంగా ఉండగా.. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ టీవీలో 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు త‌దిత‌ర ఫీచ‌ర్లున్నాయి. 43 అంగుళాల టీవీ ధర రూ.22,999 కాగా, 55అంగుళాల టీవీ రూ.39,999కి లభించనుంది. ఈ నెల 15వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్లో ఇవి అందుబాటులో ఉంటాయి.

MOBILES HOTDEALS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article