దగ్గుబాటి రానా సతీమణి మిహీకాబజాజ్ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఎంతో ముఖ్యమైన అప్ డేట్స్ ఉంటే తప్ప లైన్ లోకి రారు. అందులోనూ సినిమా ఫీల్డ్ తో ఆమెకి అస్సలు సంబంధం లేకపోవడంతో వీలైనంత వరకూ వాటి జోలికి వెళ్లరు. రానా అప్ డేట్స్ అందించడం వంటివికూడా ఆమె చేయరు. ఫేమస్ వెడ్డింగ్ ప్లానర్ ఎంతో ప్రోఫెషనల్ గా ఉంటారు. ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలు కూడా ఆమె చాలా అరుదుగా సోషల్ మీడియాలో పంచుకుంటారు. అందులోనూ రానా గురించి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మిగతా ఏ విషయాల్లోనే ఆమె పెద్దగా కనిపించరు. తాజాగా మిహీకా మా ఇద్దరు బోయ్స్ అంటూ ఓ త్రో బ్యాక్ ఫోటోని షేర్ చేసారు. వివరాల్లోకి వెళ్తే…అభిరాం వివాహం డిసెంబర్ లో శ్రీలంకలో డిస్టెనేషన్ వెడ్డింగ్ జరిగిన సంగతి తెలిసిందే. హంగులు..ఆ ర్బాటాలకు దూరంగా ఉండే ఆ కుటుంబం అభిరాం వివాహం చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిపోయింది. ఆ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు కూడా కొన్నే లీక్ చేసారు. తాజాగా ఆ పెళ్లిలో భర్త…మరిదితో కలిసి దిగిన ఫోటోని మిహీకా ఇన్ స్టా వేదికగా షేర్ చేసారు. అప్పటి ఫోటోనే ఓ స్వీట్ మెమోరీలా ఇన్నాళ్లు దాచుకుని ఇప్పుడు షేర్ చేసారు. ఇలా ముగ్గురు కలిసిన ఫోటోని మిహీకా ఇంత వరకూ షేర్ చేయలేదు.