బ్లాక్ ఫంగస్ చికిత్సలపై శిక్షణ

72


రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ 1,179 కేసులు నమోదయ్యాయని, ఆ వ్యాధి కారణంగా 14 మంది మృతి చెందారని తెలిపారు. 97 మంది వైద్య సేవలతో కోలుకున్నారని, 1068 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 1,179 కేసుల్లో 1,139 మంది కరోనా బారిన పడినవారు ఉండగా, 40 మంది సాధారణ వ్యక్తులని తెలిపారు. 370 మంది ఆక్సిజన్ సపోర్టు తీసుకోగా, 687 మందికి స్టెరాయిడ్లు అందజేశారన్నారు. 743 మంది మధుమేహ బాధితులు బ్లాక్ ఫంగస్ బారినపడ్డారన్నారు. 18 ఏళ్లలోపు ముగ్గురిలో బ్లాక్ ఫంగస్ గుర్తించగా, 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు 418 మంది ఉన్నారన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు వినియోగించే ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు, ఇతర మందుల వినియోగంపై ఆయా ఆసుపత్రుల సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆదివారం సాయంత్రం వరకూ 14,924 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 8,902 మంది ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. అనంతపురం, విజయనగరం జిల్లాలో అత్యధిక మంది ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 28,700 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 22,413 మంది ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here