విశాఖకు,అమరావతికి.. 100కు సున్నాకు ఉన్నంత తేడా

124
Minister Botsa interesting comments on the AP capital issue
Minister Botsa interesting comments on the AP capital issue

Minister Botsa interesting comments on the AP capital issue

రాజధాని అమరావతిని మార్చవద్దని రాజధాని  అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. కానీ అమరావతిపై, వైజాగ్ రాజధాని అన్న అంశంపై మాత్రం రోజుకో రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏపీ మంత్రులు . తాజాగా ఏపీ మంత్రి బొత్సా సత్యన్నారాయణ అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుగుతుందని, తప్పు చేసిన వారి విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని  మరోమారు స్పష్టం చేశారు. ఒక్క రాజధాని కట్టడమే చేతగానీ వాళ్లు మూడు రాజధానులు ఎలా కడతారంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం వల్ల ఉపయోగం ఉందో లేదో పర్యవేక్షిస్తున్నామే తప్ప చేతగాని తనం కాదని వివరించారు. ఇలా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్లేమైనా మహాపురుషులా? పుట్టడం పుట్టడమే టెక్నాలజీతో పుట్టారా? అని ప్రశ్నించారు.  రాజధాని అమరావతి, కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్న విశాఖను పోల్చి చూస్తే కనుక ‘సున్న’కు ‘వంద’కు ఉన్నంత తేడా ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అని, దేశంలో అభివృద్ధి చెందిన పది నగరాలను తీసుకుంటే అందులో వైజాగ్ ఒకటి అని అన్నారు. విశాఖతో అమరావతిని పోలిస్తే ఎలా? ఇంకొంచెం అభివృద్ధి చేస్తే కనుక  హైదరాబాద్ ను తలదన్నే సిటీగా విశాఖ ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖకు బదులు తుళ్లూరులో హైటెక్ సిటీ ఏర్పాటు చేస్తే ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలను అభివృద్ధి చేయడం అవసరమేనని, ఆయా జిల్లాల్లో ప్రజల అవసరాలను గుర్తించాలని అన్నారు. రాయలసీమ ప్రాంతం కరవుతో ఉంటుందని, అక్కడ నీరు కావాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే మౌలికసదుపాయాల కల్పన, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య, గోదావరి జిల్లాల్లో అయితే  నది అక్కడే ఉంది కానీ తాగేందుకు మంచినీరు ఉండవని.. ఇలా ప్రతి జిల్లాలో ఏదో ఓ సమస్య ఉందని అన్నారు.

Minister Botsa interesting comments on the AP capital issue,andhra pradesh, ap capital, amaravati, three capitals

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here