ఉచిత ఆహార పంపిణీ

90

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని యస్.వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యం‌.జి.యం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వి.చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గుడిమళ్ళ రవికుమార్ చేతుల‌ మీదుగా ఎంజీఎంలోని పేషేంట్ల అటెండెంట్లకు అహారం పంపిణీ చేశారు. యస్.వి హాస్పిటల్ యాజమాన్యం నడిపల్లి సతీష్ , ప్రవీణ్, పిన్నింటి వంశీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేషేంట్ల అటెండెంట్లకు ఆహార పంపిణీపై యం.జి.యం ఆసుపత్రి సూపరింటెండెంట్ అభినందించారు. మున్ముందు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలవాలని వారి‌ని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here