మంత్రికి మ‌తి ఉందా? లేదా?

47
Minister HC Permission for Ganesh Idol Immersion
Minister HC Permission for Ganesh Idol Immersion

ఈ తెలంగాణ మంత్రికి మ‌తి ఉండి మాట్లాడుతున్న‌డా.. లేదా.. అనే సందేహ‌మేస్తోంది. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని వ్య‌తిరేకించిన హైకోర్టు ఆదేశం మీద రివ్యూ పిటిష‌న్ వేస్తార‌ని చెబుతున్నారు. అలా చేస్తే ఈ మంత్రిని కూడా హై కోర్టు త‌ప్పు ప‌ట్టినా ఆశ్చ‌ర్య‌ప‌డ‌క్క‌ర్లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారని ఆయ‌న చెప్పారు. హైదరాబాద్ లో ఇప్పటికి ఇప్పుడు పాండ్స్ ఏర్పాటు చేయడం అంటే ఎంతో కష్టం అని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని, ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యంకాదని వివరించారు. భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని పెద్ద మనసుతో ఈ సంవత్సరం యధావిధిగా విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని కోర్టును కోరుతున్నట్లు చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం తో ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. విగ్రహాల నిమజ్జనం జరిగిన 48 గంటలలో వ్యర్ధాలను పూర్తిస్థాయిలో తొలగిస్తామని స్పష్టం చేశారు. గణేష్ శోభ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, దేశవ్యాప్తంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఆయన వెంట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి, చైర్మన్ సుదర్శన్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here