ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మిద్దాం…

154
Minister Jagadish Reddy onEnvironment Awareness
Minister Jagadish Reddy onEnvironment Awareness

Minister Jagadish Reddy onEnvironment Awareness

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే అనర్దాలు సమాజాన్ని బెంబేలెత్టిస్తున్నదని ఆయన వాపోయారు.
క్యాన్సర్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడించేందుకు కారణంగా నిలిచిన ప్లాస్టిక్ ను దూరంగా పెట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకునేందుకు సన్నద్ధం కావాలన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డి వద్ద అదనపు వ్యక్తిగత కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న డి యస్ వి శర్మదంపతులు తమ కుమారుడి విహహంలో బాగంగా నూలుతో తయారు చేపించిన సంచులలో శుభలేఖలు పంచుతున్నారు. అందులో బాగంగా మంత్రి జగదీష్ రెడ్డి దంపతులకు శుభలేఖ ను అందజేసిన దంపతులు తమ కుమారుడి వివాహం సందర్భంగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించడం లోభాగంగ ప్రతి ఒక్కరికి గుర్తుండి పోయేలా పంచుతున్న సంచులను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కొంచెం భారం అయినప్పటికీ శుభ సందర్బాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరినీ ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదో చెప్పేందుకు రూపొందించిన పద్ధతిని మంత్రి జగదీష్ రెడ్డి అహ్హనించారు. పెండ్లి మీ కుటుంబ సభ్యులకు బాధ్యత పెంచితే మీరు అందిస్తున్న సంచులు సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత గుర్తు చేసేలా ఉందని కొనియాడారు.

Minister Jagadish Reddy onEnvironment Awareness,#Minister Jagadish Reddy,#Make Plastic Free Society,DS Sharma Son Wedding,Telangana News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here