పేరుకే మేకిన్ ఇండియా

* బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పైన మంత్రి కేసీఆర్ విసుర్లు

దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటలపైన కేటీఆర్ మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం పేరుకే మేకిన్ ఇండియా అంటున్నా… కనీసం జాతీయ జెండాలను సైతం దేశంలో తయారు చేసే పరిస్థితులను సృష్టించలేదని… వాటిని సైతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుందని కేటీఆర్ అన్నారు.

విశ్వ గురువుగా డాంబికాలు ప్రదర్శించే కేంద్రం… 75వ భారత దేశ స్వాతంత్ర్య సంబరాలు చేస్తామని ముందే తెలిసినా, కనీసం జాతీయ జెండాలను దేశంలో తయారు చేయించాలనే ప్రణాళిక లేని పరిస్థితుల్లో కేంద్రం ఉందన్నారు. ఆత్మ నిర్భర భారత్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article