సోషల్ మీడియాపై కేటీఆర్ ఫోకస్

174
Minister KTR Speech At TRS
Minister KTR Speech At TRS

Minister KTR Speech At TRS Social Media Meet

తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ  నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలలో ఉన్నాయి. అయితే అన్ని పార్టీల కంటే అధికార టీఆర్ ఎస్ అన్నిటిలోనూ ముందు వరుసలో ఉంది. ఇక ఎన్నికల్లో భారా విజయాన్ని నమోదు చెయ్యాలన్న లక్ష్యంతో  టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి కేటీఆర్  పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తమ కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా పై ఫోకస్ పెట్టాలన్నారు.  టీఆర్ఎస్ ఫేస్ బుక్ ఖాతాలో 11 లక్షలు, ట్విట్టర్ ఖాతాలో 3.6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారని అన్నారు. చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా చెప్పొచ్చని అన్నారు.

ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో 16 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, వీళ్లందరినీ సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యపరచాలని పిలుపు నిచ్చారు. వినూత్న ఎన్నికల ప్రచారంతో ప్రజలకు దగ్గరవ్వాలని, మహిళలు తమ నివాసాల ముందు ‘కారు’ గుర్తు ముగ్గులు వేస్తున్నట్టుగా, పతంగులపై కేసీఆర్ చిత్రాలు ఉండేలా చూడాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీకి అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి కూడా లేదని అన్నారు. ఇక కాంగ్రెస్ కూడా ఏం చెయ్యాలో అర్ధం కాక దిక్కులు చూస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ప్రతి చోటా ఎగరాలని చెప్పారు కేటీఆర్.

Minister KTR Speech At TRS Social Media Meet,municipal elections, KTR, TRS party, social media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here