నారాయణపేట జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల ఐసీయూ వార్డును ఆయన ప్రారంభించారు. సమీకృత మార్కెట్‌కు, అమరవీరుల స్మారక పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.