టికెట్లు అమ్ముకుంటున్న మల్లారెడ్డి ?ఆడియో క్లిప్

134
Minister Malla Reddy Audio Tape Leaked
Minister Malla Reddy Audio Tape Leaked

Minister Malla Reddy Audio Tape Leaked

తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి మల్లారెడ్డికి ఆది నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇప్పుడు తాజాగా అధికార టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి మంత్రి మల్లారెడ్డి రూపంలో ఎదురైందని చెప్పాలి. ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు రావటమే కాదు.. వైరల్ గా మారింది. తనకు టికెట్ ఇచ్చేందుకు మంత్రి మల్లారెడ్డి తనను రూ.50 లక్షలు డిమాండ్ చేశారంటూ బోడుప్పల్ టీఆర్ఎస్ నేత రాపోలు రాములు ఆరోపిస్తున్నారు. డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక డివిజన్ అభ్యర్థిత్వం కోసం ఏకంగా రూ.50లక్షలు డిమాండ్ చేశారని వైరల్ అవుతున్న  అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. టికెట్ కేటాయింపులో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని.. ఆయన టికెట్లు అమ్ముకుంటున్నట్లుగా రాపోలు సదరు ఆడియో క్లిప్ లో ఆరోపించారు. తన వర్గానికి టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. టికెట్ కేటాయింపుల విషయంలో తనకున్న అభ్యంతరాల్ని మంత్రి మల్లారెడ్డితో మాట్లాడిన రాపోలు ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చి వైరల్ అవుతోంది. టికెట్ కేటాయింపులో ఏదో జరిగిపోతుందన్న భావనకు బలం చేకూరేలా ఈ ఆడియో క్లిప్ ఉందని చెప్పాలి. టికెట్ కేటాయింపుల కోసం భారీగా డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారంటూ మంత్రిపై వచ్చిన ఆరోపణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. మొత్తంగా టీఆర్ ఎస్ పార్టీకి ఈ ఆడియోక్లిప్ కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది.పతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది.

Minister Malla Reddy Audio Tape Leaked,Telangana , minister malla reddy, rapolu ramulu , audio clip, tickets , for sale, minister demand, 50 lakhs , trs party

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here