అంచెలంచెలుగా మద్య నిషేధం అమలు

Liquor Ban in Andhra Pradesh

మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి అవసరంలేదని మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని తెలిపారు. పేదల సంక్షేమం కోసం అవగాహన కల్పిస్తు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి హామీ ఇచ్చారు. మద్య రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

పేదల కుటుంబాల్లో ఆనందం నింపాలన్నదే లక్ష్యమన్నారు మంత్రి నారాయణ స్వామి.కాగా ఏపీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని వైసీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా బెల్టుషాపులను మూసివేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో అంచెలంచెలుగా నిషేధం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. అలాగే నాటుసారా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామనీ తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article