సిద్ధార్థ ఇక్క‌డ ట్యాక్సులు క‌డుతున్నాడా?

హీరో చిరంజీవి సీఎం జగన్ ను కలవటానికి అపాయింట్మెంట్ అడిగారో లేదో త‌న‌కు తెలియద‌ని మంత్రి పేర్ని నాని అన్నారు. తమ సమస్యలు వినాలని సినిమా పంపిణీదారులు అడిగారు. సీజేఐ రమణ కార్యక్రమాలు ఉండటంతో ఇవాళ సమయం ఇచ్చాను. హైకోర్టు సూచనలతో ఇప్పటికే టికెట్ల ధరలు పై ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశామ‌న్నారు. హీరో సిద్ధార్థ బహుశా సీఎం స్టాలిన్, అక్కడి మంత్రుల గురించి లేదంటే మోడీ గురించి అన్నారేమో అని ఎద్దేవా చేశారు. సిద్ధార్థ రాజకీయ నాయకులు విలాసంగా బతుకుతున్నారు అన్నారంటున్నారు. సిద్ధార్థ్ ఉండేది తమిళనాడులో. ఈ రాష్ట్రంతో ఏం సంబంధం ఉంది? ఇక్కడ ఆయన కట్టే ట్యాక్సులు ఏమున్నాయి? మేము ఏ రకంగా బతుకుతున్నామో సిద్ధార్థకు ఏం తెలుసు అని చుర‌క‌లు అంటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article