మంత్రి వర్గ ఏర్పాటు … హరీష్ కు అగ్ని పరీక్ష

minister preparation and Tuff situation for Harish

తెలంగాణా రాష్ట్రంలో అధికార పార్టీ లో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. తనయుడిని హీరో చెయ్యాలని భావించిన గులాబీ బాస్ అల్లుడుని జీరో చేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఇక మంత్రి వర్గంలో హరీష్ రావుకు స్థానం ఉంది అని భావించిన అంతలోనే హరీష్ కు చోటు దక్కేలా లేదు అన్న వార్తలు పార్టీ లో అంతర్గతంగా కలకలం రేపుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ ఇప్పుడు అగ్ని పరీక్ష ను ఎదుర్కొంటున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రి వర్గ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ ఏర్పాటుకు కూడా తేదీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఈ నెల 18వ తేదీన జరుగుతోంది. అదే రోజు మంత్రివర్గ ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఎవరెవరికి మంత్రి పదవి వరించనుందో అని పార్టీ లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆశావహులు కేటీఆర్ చుట్టూ , కేసీఆర్ చుట్టూ ప్రదిక్షణలు చేశారు. కానీ గులాబీ బాస్ మంత్రుల విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని సాక్షాత్తు గులాబీ బాస్ తనయుడు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈ నేపధ్యంలో ఆ అదృష్టవంతులు ఎవరు అన్న దానిపై ఎవరి అంచనాలలో వాళ్ళు ఉన్నారు. కానీగులాబీ దళపతి ఎవరూ ఊహించనిది చేస్తారు. అది ఆయన ప్రత్యేకత .
ఇక ఈ నేపధ్యంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదే మంత్రి వర్గ ఏర్పాటు లో హరీష్ రావుకు స్థానం లేదట. అయితే, ఈసారి కూడా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడదనే సంకేతాలు అందుతున్నాయి. ఆరు లేదా ఏడుగురిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. దాంతో హరీష్ రావుకు ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీ రామారావుకు కూడా స్థానం ఉండదని అంటున్నారు. అసలు గులాబీ బాస్ ఆలోచన ఏమిటో అంతు చిక్కటం లేదని పార్టీ శ్రేణులలోనే చర్చ సాగుతోంది.
ఈ నెల 18వ తేదీన మంత్రివర్గ ఏర్పాటు చేపట్టకపోతే నెలాఖరులోనే ఉంటుందని అంటున్నారు. ఇక కేసీఆర్ మాత్రి వర్గంలో ప్రస్తుతం ఉన్న హోం మంత్రి మహమూద్ అలీ మినహాయించి మరో16 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే, మంత్రి వర్గ ఏర్పాటు లో మరో ఆరుగురు లేదా ఏడుగురిని తీసుకోవచ్చునని అంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణ ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. చూడాలి హరీష్ రావు పేరు లేకుంటే మంత్రిగా అవకాశం ఇవ్వకుంటే హరీష్ రావు ఏం చేస్తాడో .

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article