సుమలతపై మంత్రి రేవణ్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

Minister Revanda Sensational Comments on Sumalatha

సీనియర్ సినీ నటి, దివంగత రాజకీయ నాయకుడు అంబరీష్ భార్య సుమలతపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం రోజున సుమలతను కించపరిచే విధంగా రేవణ్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.బెంగళూరులో శుక్రవారం రేవణ్ణ మీడియాతో మాట్లాడుతూ ‘భర్త చనిపోయి నెల రోజులు కాలేదు.. అప్పుడే సుమలత అంబరీష్‌కు రాజకీయాలు అవసరమా?’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సుమలతను సంప్రదిస్తే.. దిగజారుడు రాజకీయ వ్యాఖ్యలు తాను చేయనన్నారు.
కాంగ్రెస్‌ తరఫున మండ్య నుంచి పోటీ చేయాలని సుమలత భావించగా, పొత్తుల్లో భాగంగా ఆ స్థానా న్ని దేవెగౌడ మనమడు నిఖిల్‌ కుమారస్వామి(జేడీఎ్‌స)కు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. స్వతంత్ర అభ్యర్థిగానైనా మండ్యలో పోటీ చేయాలని సుమలత పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం దే వెగౌడ, సీఎం కుమారస్వామి బెంగళూరులో ఆమెతో సమావేశమై జేడీఎస్‌ తరఫున మైసూరు-కొడగు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆహ్వానించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article