కవితక్క తీవ్ర దిగ్భ్రాంతి

57
Ministers Shocked On Nayani's Demise
Ministers Shocked On Nayani's Demise

Ministers Shocked On Nayani’s Demise

కార్మికుల పక్షపాతి, పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం పరితపించే మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని నర్సింహారెడ్డి మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో నాయిని కీలకపాత్ర పోషించారు. 2001 లో trs పార్టీ ఆవిర్భావం నుంచి kcr వెంటే ఉన్నారు. నాయిని నర్సింహారెడ్డి మృతి తనను ఎంతో కలచివేసిందన్నారు.

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నాయిని మృతి పట్ల సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్మికుల అభ్యున్నతి సంక్షేమం కోసం వారి వైపున నిలబడి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా చిరస్థాయిగా నాయిని నిలిచి పోతారని ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట నడచి ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాయిని కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

కార్మిక పక్షపాతి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి గారి మరణం బాధాకరం. తొలిదశ ఉద్యమం నుండి నేటి వరకు రాష్ట్రం కోసం,కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడిన వ్యక్తి ‌నర్సన్న.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుడు,తెలంగాణ రాష్ట్ర తొలి హోమ్ మినిస్టర్ నాయిని నర్సింహారెడ్డి మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. రాజకీయాల్లో ,కార్మిక నేతగా పనిచేసిన నాయిని 2001నుండి 2014 వరకు వారితో కలిసి ఉద్యమం చేసిన అనుబంధం మరువలేనిది.నాయిని నర్సింహారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here