తిరుమలకు పోటెత్తిన భక్తులు, మంత్రులు

91
Ministers Visits Tirumala
Ministers Visits Tirumala
Ministers Visits Tirumala on Vaikunta Ekadashi
వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.   నేడు ఉత్తరద్వార దర్శనం జరగనున్న నేపథ్యంలో ఉత్తర ద్వారం గా చెప్పబడే వైకుంఠ ద్వారం గుండా  శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.  తిరుమల శ్రీవారి ఆలయానికి  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు  పోటెత్తారు.

తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా ఇప్పటికే వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరెంతో మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.  దీంతో  నేడు తిరుమల  రద్దీగా మారింది. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో.. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత  తదితరులు ఉన్నారు.

నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్‌, పుష్ప శ్రీవాణి,  బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎంపీ మిథున్‌ రెడ్డి,అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్‌లు సుబ్బరామిరెడ్డి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖులు.. రాజేంద్ర ప్రసాద్‌, సునీల్‌, సుమలత, కమెడియన్‌ సప్తగిరి,  తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here