మైనర్ బాలికపై అత్యాచారం-గర్భం

31
Minor girl raped by cousins
Minor girl raped by cousins

Minor girl raped by cousins

ఐదు నెలలుగా అత్యాచారం ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా మైనర్లపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా గుజరాత్‌లో మరో సంఘటన జరిగింది. వావి వరసలు మరిచి ముగ్గురు బాలురు, పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్బం దాల్చింది. నవ్‌సరి జిల్లాకు చెందిన బాధితురాలి తండ్రి వ్యవసాయ కూలీ. తల్లిదండ్రులు పొలానికి వెళ్లడంతో పన్నెండ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కజిన్ అయిన బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని తన మరో ఇద్దరు కజిన్లతో పంచుకున్నాడు. బాలికను బెదిరించి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇలా ఒకటికాదు… రెండు కాదు… ఐదు నెలలుగా అత్యాచారం చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం బాలికకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా, ఆమె నాలుగు నెలల గర్భవతి అన్న విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించారు. అత్యాచారం జరిగింది నిజమేనని అంగీకరించింది. అత్యారం చేసిన ముగ్గురు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here