మీరాబాయి చాను స్వాగత వేడుక

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి .కిషన్ రెడ్డి అభినందన సందేశం

“ఒలింపిక్స్ క్రీడల వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించిన.. పద్మశ్రీ సైఖోమ్ మీరాబాయి చానుకు నా హృదయపూర్వక అభినందనలు. భరతమాత గర్వించేలా మన దేశ కుమార్తెలు పతకాలు గెలుచుకోవడం పట్ల నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోన్నది . ఒలింపిక్ పోడియంపై మెడలో వెండి పతకంతో మీరాబాయి ప్రతి భారతీయ హృదయాన్నీ గెలుచుకుంది”-

“దృఢసంకల్పం, నిరంతర కృషి , సవాళ్ళను అధిగమించాలనే తపన మనం కన్న కలలను సాధించడానికి ఏకైక మార్గం అని… మిరాబాయి మరొకసారి నిరూపించారు. ఆమె సాధించిన విజయం క్రిడా ప్రపంచానికే కాకుండా… లక్ష్యం దిశగా శ్రమించే ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది”-

“మీరాబాయి సుదీర్ఘ ప్రయాణానికి ఈ విజయం తొలిమెట్టు అలాగే మున్ముందు ఆమె సాదించబోయే విజయాలను చూసి మనందరం గర్వించే క్షణాలకు నాంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆమెకు తోటి భారతీయులందరి మద్దతు ఉంటుందని విశ్వసిస్తున్నాను”-

“దేశానికి గర్వించదగ్గ పురస్కారాలను అందించటంలో.. ఈశాన్య రాష్ట్ర యువత క్రీడల పట్ల చూపిస్తున్న ఉత్సాహం, వారి చురుకైన క్రీడా సంస్కృతి, దోహద పడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది”.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article