తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీరు అందించే గొప్ప పథకం మిషన్ భగీరథ దానికి ఇంచార్జీగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పనిచేశారు తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ది కోసం కీలకంగా పనిచేస్తున్న మంత్రి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆప్తుడు ఆయన BKIT పూర్వ విద్యార్థి కావడం మనందరికీ గర్వకారణం,అభినందనీయం.- బాల్కీ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్ర
బాల్కీ BKIT లో సివిల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ లో ఎదుర్కోవాల్సిన సవాళ్లను వారికి వివరించారు.
తాను సివిల్ ఇంజనీర్ అయినందువల్లే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతీష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ,కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి వాటిలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తనను భాగస్వామ్యం చేశారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ త్రాగు నీరు అందిస్తున్నామని అది మూడు సంవత్సరాల్లో పూర్తి చేశామన్నారు.