Sunday, October 6, 2024

మిషన్​ భగీరథ అంతా బోగసేనా..?

  • అప్పుడు 100శాతం.. ఇప్పుడు 50 శాతం అంటున్నారు
  • డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క 
మిషన్ భగీరథపై గత ప్రభుత్వం చేసిన ప్రచారమంతా బోగస్ అని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ పథకం కింద రూ. 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని గత ప్రభుత్వం డబ్బా కొట్టిందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని…..నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. ఇదే అబద్దాలతో కూడిన నివేదికను కూడా కేంద్రానికి  పంపారన్నారు. అయితే ఇవన్నీ పచ్చి అబద్దాలని భట్టి విక్రమార్క అన్నారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి అధికారులతో ఆయన సమీక్ష చేశారు. రాష్ట్రంలో 23,824 ఆవాసాలు ఉండగా 1156 ఆవాసాల్లో 50  శాతం మాత్రమే నీళ్లు అందుతున్నాయని అధికారులు చెప్పిన సమాధానంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రూ. 42 వేల కోట్లు ఖర్చు చేసిన ఇంకా తాగునీటి ఎద్దడి ఉండడం శోచనీయమని భ ట్టి వ్యాఖ్యానించారు.  ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలకు హైదరాబాద్ మెట్రో నుంచి తాగునీటిని సరఫరా చేస్తుండగా ఆయా మున్సిపాలిటీలు మిషన్ భగీరథ కింద మంచి రెడ్డి సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో ఎందుకు చూపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
తాగునీటి సరఫరా కి ప్రధాన సోర్స్ ను వందల కిలోమీటర్ల నుంచి కాకుండా ప్రతి సమీపంలో నుంచి తీసుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి తీసుకోవడం మూలంగా తరచూ పైప్ లైన్ లు  పగిలిపోవడం వంటివి ఉత్పన్నమై తాగునీటి  సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
మిషన్ భగీరథ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది జీవితాలు నెలల తరబడి ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి అని ప్రశ్నించారు. ఒక్కో ప్రాంతంలో ఒకరకంగా కార్మికుల వేతనాలు ఎందుకు ఉంటున్నాయని ప్రశ్నించారు. 8వేల నుంచి 13 వేల వరకు జీతాలు అందుతున్నట్టు తన వద్ద సమాచారం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వేతనాల నిధుల్లో ఎక్కువ మొత్తం ఏజెన్సీలు కట్ చేసుకుని మిషన్ భగీరథ కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారని….. దీనిపై సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం అందిస్తున్న వేతనాలు  కార్మికులకు ప్రయోజనం చేకూర్చాల తప్ప మధ్య భక్తులకు కాదన్నారు.
రాష్ట్రంలో మొత్తం ఉన్న ఏజెన్సీలు ఎన్ని, ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు, ఏజెన్సీలు కార్మికులకు ఇస్తున్న వేతనాల వివరాల తో  సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా వేతనాలు ఉండేలా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం కోసం చేసిన వేల కోట్ల అప్పు చెల్లిస్తున్న పథకం ప్రయోజనం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదని భట్టి   అన్నారు.  సమీక్ష సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మెంబర్ సెక్రెటరీ టిఎస్ ఫైనాన్స్ కమిషన్ స్మిత సబర్వాల్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular