ఎక్కడికెళితే కరోనా?

మియాపూరులోని ఓ బడా స్టోర్ రూముకు వెళితే ఓ మహిళకు కరోనా వచ్చింది. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వెళ్లిన ఆమె ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నారని సమాచారం.

74
miyapur corona case- tsnews
miyapur corona case- tsnews

కరోనాకు భయపడి ఎప్పుడూ బయటికి రావడానికీ భయపడే ఓ మహిళ.. అత్యవసర పరిస్థితిలో చిన్న చిన్న సరుకులు కొనేందుకు ఇంటికి చేరువలో గల ఓ అతిపెద్ద స్టోర్ రూముకు వెళ్లారు. తను మాస్కు పెట్టుకున్నారు. అక్కడికెళ్లాక అందరూ సామాజిక దూరం పాటించడం గమనించారు. దీంతో ఏం కాదులే అని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తనకు కావాల్సిన వస్తువుల్ని త్వరత్వరగా కొనుగోలు చేసి గబగబా ఇంటికొచ్చేశారు. అయితే, ఓ మూడు రోజుల తర్వాత ఆమెకు జలుబు, గొంతునొప్పి వంటివి ఆరంభమయ్యాయి. ఎందుకైనా మంచిదని కరోనా టెస్టు చేయించుకున్నారు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కరోనా పాజిటివ్ అని వచ్చిన రిపోర్టును చూసి ఆశ్చర్యపోయారు. అయినా, మానసిక ధైర్యం తెచ్చుకుని తగిన చికిత్స తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఆమెకు అన్నిరకాలుగా అండగా నిలవడంతో తను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయా అపార్టుమెంటుకు చెందిన సంఘం ఆమెను ప్రశ్నిస్తే.. కరోనా రావడానికి గల కారణం సమీపంలోని బడా స్టోర్ రూముకు వెళ్లడమేనని ఆమె చెప్పారు. ఈ సంఘటన మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే రోడ్డులో గల ఒక బడా గేటెడ్ కమ్యూనిటీలో చోటు చేసుకుంది. మరి, అక్కడికి వెళ్లడం వల్లే ఆమెకు కరోనా వచ్చిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే విషయం ఎలా తేలుతుంది? కాస్త క్లిష్టమైన సమస్యే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here