గులాబీ గూటికి చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే చందర్

MLA Chandhar going to join TRS Party

గులాబీ పార్టీ తాజా ఎన్నికల్లో గెలిచిన పక్క పార్టీల నేతలను, స్వతంత్రులను అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణా రాష్ట్రంలో ఉద్యమ పార్టీ గా పుట్టి రాజకీయ పార్టీ గా మారిన టీఆర్ఎస్ పార్టీ స్టార్ బాగుంది. గత ఎన్నికల్లో కంటే భారీ మెజార్టీ ఇచ్చి ముందస్తు ఎన్నికల్లో మరో మారు టీఆర్ ఎస్ కు పట్టం కట్టారు తెలంగాణా ప్రజలు. ఇక ఆ పార్టీ ప్రస్తుతం తెలంగాణా లో ఎదురు లేని పార్టీ గా అవతరించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించినప్పటి నుండి ఆ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి . ఎన్నికల ఫలితాల అంతరం ఎన్నికల్లో గెలిచినా స్వతంత్రులు ఇద్దరూ టీఆర్ ఎస్ లో చ్రనున్నట్టు ప్రకటించారు. ఒక ఎమ్మెల్యే గతం లోనే టీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక తాజాగా రామగుండం నుండి పోటీ చేసి గెలిచినా స్వతంత్ర ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కూడా టీఆర్ ఎస్ చేరారు. కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది.
కరీంనగర్ జిల్లా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టీఆర్ ఎస్ లోనే ఉన్న కోరుకంటి చందర్ టికెట్ ఆశించారు. కానీ అక్కడ టీఆర్ ఎస్ తరపున సోమారపు సత్యన్నారాయణ ఎన్నికల బరిలోకి దిగారు. ఇక సోమారానికి టికెట్ కేటాయిస్తున్న నేపధ్యంలో చందర్ పార్టీ నుండి బయటకు వెళ్లి ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఆయన తాజాగా తన అనుచరులతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షం‌లో టీఆర్ఎస్‌లో చేరారు.
ఇక తెలంగాణ భవన్‌లో జరిగిన ఆ చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్ తో పాటు అతడి అనుచరులకు కేటీఆర్ గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక చేరికల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ రామగుండం ప్రజలు తెలివిగా ఓటేశారని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యన్నారాయణ ను ఓడించినా తెలివిగా టీఆర్ ఎస్ నుండి బయటకు వచ్చిన కోరుకంటి చంద్ర కు ఓటేసి గెలిపించారు కానీ అక్కడ కూడా కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ఆ సీటు ప్రజలు ఈ ఎమ్మెల్యే చందర్ కు అప్పగించారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చందర్ చురుకుగా పాల్గొన్నారని చెప్పిన కేటీఆర్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని అలాగే సింగరేణి ఎన్నికల్లోనూ అతడు టీఆర్ఎస్‌ను గెలిపించాడని కేసీఆర్ చెప్పారు .
ఇక అందరం కలిసి రామగుండం లో పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని కేటీఆర్ సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ భారీ మెజార్టీ సాధించేలా కృషి చెయ్యాలని చెప్పారు. రామగుండం లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని… త్వరలోనే ఆ హామీ నెరవేర్చుతామని కేటీఆర్ పేర్కొన్నారు . అసెంబ్లీ ఎన్నికల్లో చందర్, సోమారపు సత్యనారాయణ కు కలిసి లక్షకు పైగా ఓట్లు వచ్చాయని… పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ ఓట్లు టీఆర్ఎస్ కే పడేలా ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. అయితే సోమారపు సత్యన్నారాయణ తనకు ప్రత్యర్ధిగా నిలబడి గెలిచిన చందర్ చేరికపై గుర్రుగా ఉన్నారు. చందర్ పోటీ లేకుంటే తానూ గెలిచేవాడినని ఆయన బాధ . ఇక కేటీఆర్ ఆదేశాల మేరకు కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చందర్ కు రామగుండం నియోజకవర్గానికి అభివృద్ది బాధ్యతలను తానే వ్యక్తిగతంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. మొత్తానికి చందర్ చేరికతో ఎమ్మెల్యేల సంఖ్య 90 కి చేరింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article