Wednesday, September 18, 2024

హరీష్ రావుది చిట్ చాట్ కాదు, సోది చాట్

  • బిఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేదు
  • ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హరీష్ రావుది చిట్ చాట్ కాదు, సోది చాట్ అని, పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంటే ఈర్ష పడుతున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గాంధీ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేసిన సిఎం రేవంత్ రైతుల గుండెల్లో నిలిచిపోయారన్నారు.

గత ప్రభుత్వం వరంగల్ లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిందని, అవాక్కులు చెవాక్కులు మానేసి ప్రజా పాలనకు బిఆర్‌ఎస్ సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, చెరువులను నాలాలను రక్షించే పనిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.

చెరువును కబ్జాచేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చామని, రేవంత్ ఏ పనిచేసినా బిఆర్‌ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంటే గగ్గోలు పెడుతున్నారని, ఐటీ రంగాన్ని తెలంగాణకు పరిచయం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెడతామంటే అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.

కొన్ని టెక్నీకల్ సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదని, అవికూడా స్పెషల్ డ్రై పెట్టి చేస్తున్నామని ఆయన తెలిపారు. తన నియోజకవర్గంలో రుణమాఫీ కాలేదని అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈర్షద్వేషాలతో బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, హైడ్రా ముందు పార్టీలు, కులాలు, మతాలు లేవని, అక్రమంగా ఎవరు కట్టిన కూల్చుడేనని ఆయన తెలిపారు. ముందుగా బిజెపి నేతలు హైడ్రాపై అవగాహన పెంచుకొవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular