అనిత ఓ మహిళను దారుణంగా తన్నినందుకే దాడి చేశారన్న ఎమ్మెల్యే కోనప్ప

MLA Konappa Sensational Comments

సార్సాలో ఎఫ్ఆర్ఓ అనిత ఓ మహిళను దారుణంగా బూటు కాలితో తన్నిందని, ఈ కోపంతోనే ఆమె భర్తే ఎఫ్ఆర్ఓ అనితపై దాడి చేశారని సిర్పూర్ కాగజ్‌నగర్ ‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చెప్పారు.
మంగళవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోడు భూముల్లో తనకు ఇంచు భూమి ఉన్నట్టు రుజువు చేస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాదు ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పి కాగజ్‌నగర్‌ను వదిలివెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే ధైర్యం లేని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.సార్సాలో కూడ చోటు చేసుకొన్న ఘటనలకు కూడ అటవీ శాఖ అధికారులే కారణమన్నారు.

సార్సాలో చాలా కాలంగా గిరిజనులు భూములను సాగు చేసుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ భూమిని తాము స్వాధీనం చేసుకొని అడవిని పెంచేందుకు చర్యలు తీసుకొంటున్న విషయాన్ని పారెస్ట్ అధికారులు కనీసం తన దృష్టికి కూడ తీసుకురాలేదన్నారు. ఒకవేళ ఈ విషయాన్ని తనకు ముందుగా సమాచారం ఇస్తే తాను గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేవాడినన్నారు.పోడు భూముల పేరుతో ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై యుద్దం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సార్సాలో అటవీ శాఖాధికారులపై దాడిని తాను ఖండించినట్టుగా చెప్పారు. తన సోదరుడు ఫారెస్ట్ అధికారిపై దాడికి పాల్పడలేదన్నారు. అయితే ఈ ఘటనలో పాల్గొన్నందుకు పార్టీ పదవికి, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ పదవికి రాజీనామా చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ఫారెస్ట్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ట్రాక్టర్లను ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. సార్సా ఘటనపై కాంగడ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనతో సంబంధం లేని తాను ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు. తాను రాజీనామా చేస్తే తమకు ఏదైనా అవకాశం దక్కుతోందనే ఆశతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారని ఆయన విమర్శించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article