MLA Rapaka Milk Abhishekam to AP CM YS Jagan
జనసేన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. పేరుకి జనసేన ఎమ్మెల్యే అయినా ప్రస్తుతం అయన వ్యవహారశైలీ భిన్నంగా ఉంది. ఏపీ అధికారపక్షానికి అయన మద్దతు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. వీలు చిక్కినప్పుడల్లా జగన్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న రాపాక పలు సమయాల్లో జగన్‌పై అసెంబ్లీలోనే ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా అయన మరో అడుగు ముందుకు వేసి అందర్నీ షాక్ కు గురి చేశాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్ ఆటోస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గతంలో కూడా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి చర్చల్లో నిలిచారు రాపాక. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు.