MLA S and MLC S are in Race
మంత్రివర్గ విస్తరణ టెన్షన్ …
తెలంగాణ అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఈనెల 18వ తేదీన ఈ వర్గ విస్తరణ చేయనున్న నేపథ్యంలో పదవుల కోసం సీనియర్లు జూనియర్లు పోటీ పడుతున్నారు. ఆశావహుల నుండి ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు చేస్తున్నారు. ఇతర గెలిచిన ఎమ్మెల్యేలు నుండే కాకుండా, ఎమ్మెల్సీల నుండి పోటీ తీవ్రతరం కావడం తో ఇరు వర్గాలను సంతృప్తి పరిచే విధంగా మంత్రివర్గ విస్తరణ చేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ క్యాబినెట్… గత క్యాబినెట్లో కాకుండా ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలో వినూత్నంగా ఉండబోతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పరిగణలోకి తీసుకొని సమానత్వాన్ని పాటించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఒక కీలక శాఖల విషయాలను సీనియర్ మంత్రుల విషయాలను భారీ మార్పులు ఉండేలాగా ఈ మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. గత ప్రభుత్వంలో 18 మంది మంత్రులకు గాను ముగ్గురు ఎమ్మెల్సీలకు అవకాశమిచ్చారు కెసిఆర్. అయితే ఈసారి ఎమ్మెల్సీల నుండి పోటీ అధికంగా ఉండడం, ఇక ఎమ్మెల్యేల నుండి కూడా పోటీ తీవ్రతరం కావడం తో మంత్రివర్గ విస్తరణ అంశం రసవత్తరంగా మారుతోంది .ఇటు పార్టీలోను చర్చకు దారితీస్తోంది. గతంలో ముగ్గురు ఎమ్మెల్సీలకు కడియం శ్రీహరి, నాయిని నరసింహారెడ్డి, మహమూద్ అలీ కి మంత్రులుగా అవకాశం ఇచ్చిన కెసిఆర్ ఈ దఫా ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే మహమూద్ అలీ కి హోం మంత్రిగా అవకాశం కల్పించారు. ఇక కడియం శ్రీహరి కి ఎస్సీ సామాజికవర్గం కావడంతో అలాగే మంత్రిగా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఆయనకున్న అనుభవం నేపథ్యంలో తిరిగి మంత్రిగా అవకాశమిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఎక్కువ మంది మంత్రిగా అవకాశం ఇవ్వాలని పోటీ పడుతున్నారు. చాలాకాలంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న దాస్యం వినయ భాస్కర్, ఇక మంత్రిగా పనిచేసిన సీనియర్ రెడ్యా నాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆరూరి రమేష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక వీరంతా మంత్రులు కావాలని పోటీ పడుతున్న నేపథ్యంలో కెసిఆర్ వీరందరినీ సంతృప్తి పరిచేలా ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడో మరి. ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ, సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా, మహిళా ప్రాధాన్యాన్ని కూడా కల్పిస్తూ మంత్రివర్గ విస్తరణ చేయడం కెసిఆర్ కు కత్తి మీద సామే.