ఆ ఎమ్మెల్యే పేరుతో సెక్స్ వీడియో

MLA SEX VIDEO

కర్ణాటక ఎమ్మెల్యేల్లో కొందరు ప్రజల్లో తమ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతోందని వాపోతూ ఉన్నారు. గత కొన్ని రోజుల పరిణామాలతో ప్రజలంతా కర్ణాటక ఎమ్మెల్యేలను అసహ్యించుకుంటున్నారని అక్కడి నేతలు అంటున్నారు. అసెంబ్లీ వేదికగానే వారు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయంలో సూటిగా స్పందిస్తూ ఉన్నారు. రాజకీయ అనిశ్చితి ప్రజల్లో నేతల ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉందని వారు వ్యాఖ్యానించారు.

ఆ సంగతలా ఉంటే..తన పేరుతో ఒక గే సెక్స్ వీడియోను వెబ్ లో పెట్టారంటూ బీజేపీ ఎమ్మెల్యే అరవింద లింబావళి వాపోయారు. ఆ వీడియోను సైతం ఆయన అసెంబ్లీలో ప్రదర్శించారు. తనను డీఫేమ్ చేయడమే లక్ష్యంగా కొందరు ఆ వీడియోను పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఫేక్ వీడియోను పెట్టి తనపై రాజకీయ కుట్ర చేయాలని కొంతమంది చూస్తున్నారని ఆయన వాపోయారు. ఆ ఫేక్ వీడియో వల్ల తను మాత్రమే కాకుండా తన కుటుంబీకులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.ఈ విషయంలో ఆయనను స్పీకర్ సముదాయించారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేసు కూడా నమోదు అయినట్టుగా తెలుస్తోంది. ఆ నకిలీ వీడియోను పోస్టు చేసిన వారెవరో కనుక్కొనే పనిలో తాము ఉన్నట్టుగా కర్ణాటక పోలీసులు ప్రకటించారు.

TRUMP ON KASHMIR

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article