ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

ఒక కుటుంబం దుర్మరణానికి కారణమైన తన కుమారుడు రాఘవేంద్రరావు దౌర్జన్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తక్షణమే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. పాల్వంచలో రామకృష్ణ కుటుంబానికి బలవన్మరణానికి కారణమైన వనమా రాఘవేంద్రరావును కఠినంగా శిక్షించాలని కోరింది. హైదరాబాద్ మగ్దూంభవన్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎంఎల్ కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావులు మాట్లాడారు. రామకృష్ణ కుటుంబం సజీవ దహనమవడానికి కారణమైన వనమా రాఘవేంద్ర వేధింపులు మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని చాడ వెంకట్ విమర్శించారు. తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని రాఘవేంద్ర హద్దులు మీరి ప్రవర్తించారని, రామకృష్ణ మరణించే ముందు తీసిన వీడియోతో ఆ విషయం స్పష్టమైందన్నారు. మహిళలను వేధించడం, విచ్చలవిడిగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఇలాంటి దుర్మార్గులు, మానవమృగాలను కఠినాతి కఠినంగా శిక్షించాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రామకృష్ణ సూసైడ్ నోట్, వీడియో వచ్చి నాలుగు రోజులైనా రాఘవను అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు.
ప్రతిపక్షాలను తప్పుపట్టడం విడ్డూరం : కూనంనేని
రాఘవేంద్రరావు దుశ్చర్యలకు సాక్షంగా రామకృష్ణ సెల్ఫీ వీడియో ఉన్నప్పటికీ , ఆయనను తప్పుపట్టకుండా ప్రతిపక్షాలపై వనమా వెంకటేశ్వరరావు దుమ్మెత్తిపోయడం విడ్డూరంగా ఉన్నదని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. వనమాకు ఏ మాత్రం పశ్చాత్తాపం ఉన్నా కుమారుడు చేసిన దారుణానికి నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్యే పదవికి చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్ చిత్తశుద్ధి ఉంటే ఘటన జరిగిన వెంటనే వనమాను రాజీనామా చేయాలని కోరాల్సిందనని, అలాగే రాఘవేంద్రను పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందన్నారు. కింది స్థాయిలో పోలీసులు సరైన పద్ధతిలోనే వ్యవహరించినప్పటికీ, పైన పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సంఘటన జరిగి నాలుగురోజులైనా రాఘవేంద్రరావును అరెస్టు చేయలేదన్నారు. రామకృష్ణ సెల్ఫీ వీడియోను మరణవాంగ్మూలంగా భావించాలని, ఆ వీడియోను విడుదల చేయడంలో కిదంఇ స్థాయి పోలుల పాత్ర బాగుందని కొనియాడారు. ఈ ఘటనలో రాఘవేంద్రను ఇన్ని రోజులు ఉపేక్షించడానికి నిరసనగా శుక్రవారం కొత్తగూడెం బంద్ పిలుపునిచ్చినట్లు కూనంనేని వెల్లడించారు. వనమా వెంకటేశ్వరరావు తొలిసారిగా 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి ఆయన కుమారుడు రాఘవేంద్ర ఆకృత్యాలు, దౌర్జన్యాలకు అదుపులేకుండా పోయిందని కూనంనేని విమర్శించారు. అప్పట్లో వారి కుటుంబవేధింపులకు భరించలేక ఒక ఎస్ కాల్చుకొని చనిపోయారని, ఒక గిరిజన మహిళపై అరాచకం చేసి ఆస్తులు లాక్కోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వనమాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మైనారిటీ మహిళకు శిరోముండనం చేయించిన దారుణానికి రాఘవేంద్రరావు ఒడిగట్టారని మండిపడ్డారు. తాజాగా నాలుగు నెలల క్రితం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆస్తి కొట్టేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు కారణం రాఘవేంద్రనే అని సూసైడ్ నోట్ రాసారని గుర్తు చేశారు.అది మరవకుముందే తాజా ఘటన చోటు చేసుకుందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసుల నుండి బైట పడేందుకే వనమా కుటుంబం పార్టీలు మారిందని, ఇలా పార్టీలు మారిన వారి పట్ల టిఆర్ అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాఘవేంద్రపై రౌడీ షీట్ తెరవాలి
డిజిపికి సిపిఐ ఫిర్యాదు
రాఘవేంద్రను తక్షణమే అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టాలని రాష్ట్ర డిజిపి ఎంపి మహేందర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావులు గురువారం వినతిపత్రం సమర్పించారు. 1989 నుండి ఆకృత్యాలకు పాల్పడిన రాఘవేంద్రపై పాత కేసులను పరిగణలోకి తీసుకొని రౌడీ షీట్ తెరవాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. అలాగే ఆయన ఒడిగట్టిన దారుణాలు, సెటిల్మెంట్ సమగ్ర దర్యాప్తు చేసి, చట్టపరంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article