ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే

బెంగళూరు:అతనో ప్రజా ప్రతినిధి. ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. కాని విచక్షణ మరిచారు. సమాజంలో ఉన్నతమైన గుర్తింపు ఉన్న అధ్యాపకుడిపై దారుణంగా వ్యవహరిం చాడు. క్లాస్ రూమ్ లో పిల్లలంతా చూస్తుండగానే.. కాలేజీ ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. జేడీఎస్ పార్టీకి చెందిన మాండ్య ఎమ్మెల్యే ఎం.శ్రీనివాస్ మాండ్యలోని నల్వాడి కృష్ణ రాజా వడ యార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్ర మంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అక్కడ కంప్యూ టర్ ల్యాబ్కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పనుల పురోగతిపై కాలేజీ ప్రిన్సిపాల్ ను అడిగారు ఎమ్మెల్యే. అయితే ప్రిన్సి పాల్ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో ఒక్క సారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ పై దాడి చేసిన విజువల్స్ వైరల్ గా మారాయి. గురువుపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article