మంత్రులుగా పరిశీలనలో ఈ ఎమ్మెల్యేలు

MLA’S are exterminated by the minister…. కేటీఆర్ కు అదనంగా కొత్త శాఖ

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గర పడుతుండటంతో ఆశవహ్హుల్లో టెన్షన్ నెలకొంది. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెల దాటాక గానీ మంత్రి వర్గ విస్తరణ గురించి ఆలోచించలేదు గులాబీ బాస్. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార తేదీ ఖరారవ్వడంతో మంత్రివర్గ విస్తరణపై టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు . ఈ నెల 18వ తేదీ మంచి రోజు కావడంతో ఆ రోజునే మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త కేబినెట్ లో 8మందికి అవకాశం ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కేటీఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనకు మరో కొత్త శాఖ యాడ్ కానుందని తెలుస్తోంది. అయితే ఆ శాఖ ఏమిటీ అనే విషయం అటుంచితే ముఖ్యంగా తొలి విడత విస్తరణలో మంత్రి పదవులు దక్కే వారిలో హరీష్ రావు , కేటీఆర్ , కొప్పుల ఈశ్వర్ , ఇంద్రకరణ్ రెడ్డి , జోగు రామన్న , పోచారం , బాల్క సుమన్ , కడియం శ్రీహరి ,నిరంజన్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ , లక్ష్మారెడ్డి , తలసాని , జగదీష్ రెడ్డి , గుత్తా సుఖేందర్ రెడ్డి , పద్మారావు , వేముల ప్రశాంతరెడ్డి ,ఎర్రబెల్లి ,పల్లా రాజేశ్వరరెడ్డి , ఆరూరి రమేష్ , వినయ్ భాస్కర్ , రెడ్యానాయక్ , రేఖానాయక్ , గొంగిడి సునీతతో పాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సామాజిక వర్గాలు , మంత్రులుగా పని చేసిన అనుభవం , గతంలో వారి పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో శాఖల వారీగా భారీ మార్పులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు .
ఇక టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గతంలో ఉన్న ఐటీ ,పరిశ్రమలు , చేనేత శాఖతో పాటుగా ఈ దఫా సినిమాటోగ్రఫి శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా గతంలో సాగునీటి శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించగా.. ఈసారి మాత్రం దాన్ని కేసీఆర్ తన వద్దే పెట్టుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో హరీశ్ రావుకు శాసన సభా వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు అప్పగించబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది . ఇక గతంలో ఆర్థికశాఖ నిర్వహించిన ఈటెల రాజేందర్ కు ఈసారి స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ కు మాత్రం యధావిధిగా ఐటీ శాఖను కేటాయిస్తారని భావిస్తున్నారు. గత కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా ఛాన్స్ ఇవ్వలేదని విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో.. ఈసారి అలాంటి అపవాదుకు అవకాశం లేకుండా చూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈసారి మంత్రి వర్గంలో మహిళలకు స్థానం కల్పించనున్నారు కేసీఆర్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article