తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి 20వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్ రెడ్డి, మల్లేశం ఎగ్గే, మీర్జా రియాజుల్ హాసన్ ఎఫెందీ..
ఏపీలో కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరచూరి అశోక్ బాబు, బి. తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీకాలం మార్చి 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. 11వ తేదీన స్క్రుటినీ ఉంటుంది. మార్చి 13వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువునిచ్చారు. ఇక మార్చి 20 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ చేపడతారు. మార్చి 24వ తేదీలోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.