బీజేపీ వస్తే తెలంగాణ నోట్ల మన్ను పడతదా?

17
KCR LEADING IN INDIA CITY
KCR LEADING IN INDIA CITY

AMITTH SHA RETURN DELHI

Modi And Amit Shah.. Be Careful

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఐటీఐఆర్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. జిల్లాలో నవోదయ పాఠశాలలను పెట్టాలని చట్టం చెబుతున్నా.. ఇంతవరకూ మంజూరు చేయలేదన్నారు. ఎన్ని లెటర్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఒక్కసారి కాదు వందసార్లు అడిగినా పనులు కాలేదన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు 24 కోట్లు ఇవ్వమని నీతిఆయోగ్ అధికారికంగా చెప్పినా ఇవ్వలేదు. కాజీపేటకు వేగన్ ఫ్యాక్టరీ అడిగినా ఇవ్వలేదని సీఎం విమర్శించారు. వారివి మాటలు తప్ప చేష్టల్లేవు. బీజేపీ వైఖరీ మార్చుకోవాలని హితువు పలికారు. ప్రధానమంత్రి తన వైఖరీని మార్చుకోవాలని సూచించారు. తల్లిని చంపించరు.. బిడ్డను బతికించిండ్రు.. అని మోడీ అన్నారని, అన్నారు. అలాంటి మాటలను బంద్ చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రిగా కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు రోజును డార్క్ డే అని అమిత్ షా అనడాన్ని తప్పుబట్టారు. ఇలాంటిమాటలంటే ఇక సహించమని హెచ్చరించారు. ఈ మాటల్ని అమిత్ షా విత్ డ్రా చేసుకోవాలని తెలిపారు. అరవై  ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు.

తెలంగాణలో ఒక సామెత ఉంది. ఏమీ లేనోనికి ఏతులెక్కువ అని.. మొన్న కూడా బడ్జెట్ సమావేశంలో చెప్పినా. బీజేపీ వస్తే ఏమొస్తది? ఆరోగ్యశ్రీ ఆగమైతది. నోట్ల మన్ను పడుతది. ఆయుష్మాన్ భారత్ వస్తుంది. రైతుబంధు పోతది కిసాన్ సమ్మాన్ వస్తది. అయినా దీని కింద ఏమోస్తది.. పైసల్ రావు. కేవలం తియ్యగా పుయ్యగా మాటలే వస్తాయ్. సంవత్సరానికి కేవలం ఆరు వేలే వస్తుంది. ఎకరానికి పది వేలు కావాలా? ఎన్ని ఎకరాలుంటే అంత సొమ్ము వస్తది. సన్న బియ్యం పోతది దొడ్డు బియ్యం వస్తది. బీజేపీ వచ్చి రైతులకు కిరీటం పెడతది ఇక. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి పరిహారం ఇస్తారా? ఒక్క బీజేపీ రాష్ట్రంలోనైనా ఈ పథకం అమలు అవుతుందా? నాందేడ్ జిల్లా రైతులు వచ్చి తెలంగాణలో కలిపేయమని అడుగుతున్నారు. ఇదీ బీజేపీ పరిపాలన? అంత సక్కగుంటే వాళ్లు తెలంగాణలో కలుస్తామని ఎందుకొస్తరు? రూ.2,016 పింఛన్ వస్తదా? కేసీఆర్ కిట్ వస్తదా? ఏ ఒక్క బీజేపీ రాష్ట్రంలోనైనా అమలు చేస్తున్నారా? అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మరి, దీనిపై ప్రధానమంత్రి, అమిత్ షా లు ఎలా స్పందిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Telangana Cm KCR Live Speech

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here