కేసీఆర్ కి మోడీ అభినందన

కరోనా పై సమీక్షా సమావేశానంతరం సిఎం కేసీఆర్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోను కాల్ లో మాట్లాడారు. సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనలనుకేంద్ర మంత్రి హర్షవర్దన్ తనకు వివరించారని ప్రధాని సిఎంకు తెలిపారు. ‘‘ మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం..మీ సూచనలకు అభినందనలు’ ’ అంటూ ప్రధాని సిఎం కెసిఆర్ ను అభినందించారు. రాష్ట్రానికి మరింతగా ఆక్సీజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని సిఎం కెసిఆర్ ప్రధానికి ఈ సందర్భంగా విజ్జప్తి చేశారు. సిఎం చేసిన విజ్జప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. అందుకు సంబంధించి సత్వరమే చర్యలు చేపడతామని సిఎం కు హామీ ఇచ్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article