చంద్రబాబు దావోస్ టూర్ పై మోడీ ఆంక్షలు

Modi Cuts Short Chandrababu’s Davos Tour

మోడీ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తన జులుం చూపించారు. ఆయన వెళ్ళే సదస్సు పై ఆంక్షలు విధించారు. ఇక వెళ్తే ఐదుగురు చాలు అంటూ లెక్కలు చెప్పారు. ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలు… పెట్టుబడిదారుల్లో..మోడీ కన్నా.. ఎక్కువగా చంద్రబాబుకే క్రేజ్ ఉంది అది భరించలేక మోడీ ఇలా చెప్పారని ఇలాంటి ఆంక్షలు పెట్టారని అధికార టీడీపీ మోడీ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది.
ఇక ప్రపంచ స్థాయిలో ఎంతో పేరున్న చంద్రబాబు ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులకు వెళ్లాలని నిర్ణయించారు. ఏపీకి కంపెనీలు తీసుకు రావటం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుంది అని ఆయన భావన. ఇక చాలా మంది విదేశాల్లో అనేక సందర్భాల్లో వారంతా చంద్రబాబునే భారత ప్రధానిగా చెబుతూ పొరబడుతూ ఉంటారు. ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణ. గత ఏడాది.. మోడీని అక్కడ పట్టించుకున్నవారు లేరు. అంతా.. చంద్రబాబు చుట్టే మూగారు. అందుకని.. ఆయన చంద్రబాబు ప్రాధాన్యం తగ్గించటం కోసం ఇలా నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. .
ఇక ఈ ఏడాది కూడా బాబు ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు వెంట ఎక్కువ మంది దావోస్ వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు మోడీ .ప్రతి ఏడాది దావోస్‌లో ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఆ సదస్సుకు తరలి వస్తారు. అందుకే చంద్రబాబు ప్రతీ ఏడాది ఓ పదిహేను మంది బృందంతో… అక్కడికి వెళ్తారు. ఏపీ కోసం ప్రత్యేకంగా ఓ స్టాల్ కూడా ఏర్పాటు చేసి.. వీలైతే.. బస్సులపై “సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్” అనే స్లోగన్‌తో పబ్లిసిటీ కూడా చేసుకుంటారు. వీలైనంత వరకూ.. అక్కడ ఏపీ లో ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూంటారు. ఈ ఏడాది కూడా జనవరి ఇరవై నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగబోతోంది. దానికి ఎప్పట్లానే పదిహేను మందితో వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కానీ.. కేంద్రం ఐదుగురితో వెళ్లాలంటోంది. అసలు టూరే వద్దని చెబితే పోయేది.. ఐదుగురితో వెళ్లి ఏం చేయాలనేది.. ఏపీ ప్రభుత్వ ఆలోచన.
ఏ ముఖ్యమంత్రి అయినా విదేశీ పర్యటనకు వెళ్లదల్చుకుంటే… అడ్డు చెప్పడం అనేది ఇప్పటి వరకూ జరగలేదు. కానీ మొదటి సారిగా.. ఏపీ ముఖ్యమంత్రి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళ్లేందుకు సిద్ధమైన డెలిగేషన్ పై ఆంక్షలు విధించారు. పదిహేను మంది అవసరం లేదు.. ఐదుగురు చాలు అంటూ.. ఏపీ ప్రభుత్వం పంపిన అనుమతి లేఖను తిప్పి పంపారు. ఎంత మంది వెళ్లాలో చెప్పడానికి కేంద్రం ఎవరు… అని… ఏపీ ప్రభుత్వం భగ్గుమంటోంది. కేంద్రానికి ఘాటుగా తిరిగి లేఖ రాయాలని నిర్ణయించుకుంది. మోడీ.. ఆంధ్రప్రదేశ్‌పై కసితో.. అంతకంతకూ దిగజారిపోతున్నారనే అభిప్రాయాలు.. తాజా నిర్ణయంతో ఏర్పడుతున్నాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article