కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా?

MODI FIRED ON CONGRESS

  • కాంగ్రెస్ నేతలపై ప్రధాని మోదీ ఆగ్రహం
  • రఫేల్ పై తన వ్యాఖ్యలను వక్రీకరించారని ధ్వజం

కాంగ్రెస్ నేతలకు కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉందా? అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రఫేల్ విమానాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. తాను ఒక రకంగా అంటే.. ప్రతిపక్షాలు మరోరకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సోమవారం నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అసలు ప్రతిపక్ష నేతలకు కామన్‌సెన్స్‌ ఉందా అని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలు కొంచెం బుద్దితో ఆలోచించినా అందరికి అర్థం అవుతుందన్నారు. భారత్‌ దగ్గర రఫేల్‌ ఫైటర్‌జెట్లు ఉండుంటే ఇటీవల పాకిస్తాన్‌తో తలెత్తిన ఘర్షణల ఫలితం మరోలా ఉండేదని నరేంద్ర మోదీ అన్న సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. సైనికుల శక్తిని మోదీ శంకిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించాయి.

ఈ వ్యవహారంపై మోదీ తాజాగా స్పందించారు. రఫేల్ విమానాలు సకాలంలో రాకపోవడానికి కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాలే కారణమని దుయ్యబట్టారు. తాను ఒక విధంగా అంటే విపక్షాలు మాత్రం మరోలా అర్థం చేసుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు దయచేసి మీ కామన్ సెన్స్ వాడాలని హితవు పలికారు. ‘దాడుల సమయంలో మన దగ్గర్‌ రఫేల్ విమానాలు ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. మన విమానం ఒక్కటి కూడా కూలేదు కాదు, పాకిస్తాన్‌ విమానం ఒక్కటి కూడా మిగిలేది కాదు అని అన్నాను. కానీ నా వాఖ్యలను మీరు(కాంగ్రెస్‌ నేతలు) తప్పుగా చిత్రీకరిస్తున్నారు. నేను సైనికుల శక్తిని శంకిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రఫేల్ ను సరైన సమయానికే మనం పొంది ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశం. కామెన్‌ సెన్స్ తో ఆలోచింని మాట్లాడండి’  అని మోదీ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article