ఉగ్రమూకలకు బుద్ధి చెబుతాం

MODI FIRED ON TERRORISTS

  • వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటన

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా వద్ద ఉగ్రదాడికి పాల్పడ్డవాకి తగిన బుద్ధి చెబుతామని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఉద్ఘాటించారు. ఈ విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలోని యవత్మాల్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి తగిన బుద్ధి చెబుతామని స్పష్టంచేశారు. భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని వెల్లడించారు.

‘పుల్వామాలో జవాన్ల మృతి కారణంగా అందరూ చాలా బాధలో ఉన్నారని నాకు తెలుసు. మీ ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. జవాన్లలోనూ ఆగ్రహం ఉంది. వారి ఆగ్రహాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు జవాన్లు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాదు. వారికి తగిన బుద్ది చెబుతాం’ అని వ్యాఖ్యానించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ముష్కరులను చంపి పారేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయు రక్తం మరిగిపోతుందని, దాడికి పాల్పడ్డవారిని దెబ్బకు దెబ్బ తీస్తామని మోదీ స్పష్టంచేశారు. వారిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా దెబ్బ కొడతారో సైన్యమే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ కొత్త విధానానికి తెరతీశారు.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article