వారణాసి నుంచే మోదీ

30
MODI SAID NO PHONES FOR UNMARRIED GIRLS
MODI SAID NO PHONES FOR UNMARRIED GIRLS

MODI FROM VARANASI

  • అద్వానీ సీటు గాంధీనగర్ నుంచి అమిత్ షా
  • 182 మందితో బీజేపీ తొలి జాబితా

లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో 182 మంది అభ్యర్థులతో బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు కేం‍ద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం వారి వివరాలను ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బరిలోకి దిగుతుండగా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌ (లక్నో) నితిన్‌ గడ్కరీ (నాగ్‌పూర్‌), స్మృతి ఇరానీ (ఆమేథీ) స్థానాల్లో బరిలోకి దిగుతున్నారు. గాంధీనగర్‌ అభ్యర్థిగా అమిత్‌ షాను ప్రకటించడంతో.. ఆ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎంపీ, కాషాయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేద అంశంపై సందిగ్ధత నెలకొంది. బీజేపీ తొలి జాబితాలో 12 మంది ఏపీ, 10 మంది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు.

NATIONAL NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here