అంట్లు కూడా కడిగాను

MODI INTERVIEW

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకప్పుడు ఛాయ్ వాలా అనే సంగతి మనకు తెలిసిందే. అయితే, ఆయన టీ తయారుచేయడం ఒక్కటే కాదు.. అంట్లు కూడా తోమేవారట. తాను యువకుడిగా ఉన్న సమయంలో ఎలాంటి జీవితం గడిపానో చెబుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే అనే ఫేస్‌బుక్‌ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోలెడు విషయాలు చెప్పారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఏటా దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లిపోయేవాడినని, ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడినని చెప్పారు. రేడియో, దినపత్రికలు ఏమీ లేకుండా గడపేవాడినని, అది తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందని వివరించారు. రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం మీతో మీరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందని మోదీ యువతకు సలహా ఇచ్చారు. మీకు మీరే ప్రత్యేకమని, ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడొద్దని పేర్కొన్నారు. పదిహేడేళ్ల వయసులో రెండు సంవత్సరాల పాటు హిమాలయాలకు వెళ్లినట్లు తెలిపారు. ‘హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత అహ్మదాబాద్‌ వెళ్లాను. అక్కడ మా అంకుల్‌కు క్యాంటీన్‌లో సాయం చేసేవాడిని. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తిస్థాయి ప్రచారక్‌గా మారాను. ఇతరులతో కలిసి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం శుభ్రం చేసేవాడిని, టీ,ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి అన్ని పనులు చేసేవాడిని’ అని మోదీ వెల్లడించారు.

NATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article