బోస్ ఇక్కడ పుట్టడం మన అదృష్టం

MODI MAN KI BAAT

  • మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
  • అన్నింటి కంటే రేడియో ప్రభావవంతమైనదని వ్యాఖ్య

‘సుభాష్‌ చంద్రబోస్‌ పోరాట యోధులకు హీరో. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వివిధ నినాదాలతో యువతలో స్ఫూర్తి రగిలించే వారు. అటువంటి మహనీయుడు మన దేశంలో జన్మించడం భారత ప్రజల అదృష్టం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తొలుత నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌, శివకుమార స్వామికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గొప్పతనాన్ని కొనియాడారు. అలాగే శివకుమార స్వామీజీ సిసలైన బసవేశ్వర స్వామి భక్తుడని, ఆజన్మాంతం ఆయన సమాజం కోసమే బతికారని ప్రశంసించారు. వేలాది మందికి విద్య, వైద్య, ఆర్థిక సమస్యలను తీర్చిన ఆయన్ను 2007లో కలిశానని, ఆయన్ను ఎన్నటికీ మరచిపోలేనని, స్వామీజీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

ఇంకా పలు అంశాలపై మోదీ ఏమన్నారంటే… ‘‘అంతరిక్షంలో పరిశోధనలు చేసే స్థాయికి మన దేశ యువత ఎదిగింది. ఇది గర్వించదగ్గ సమయం. మన దేశానికి చెందిన విద్యార్థులు ఉపగ్రహాలు పంపే స్థాయికి చేరుకున్నారు. దేశ ప్రజలు గర్వించదగ్గ కలాం శాట్‌ను మన విద్యార్థులే తయారు చేసి ప్రారంభించారు. యువత ఇంతకంటే ఉన్నతస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ఏర్పాటు చేసింది రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు. మీతో(దేశ ప్రజలు)కాసేపు ముచ్చటించాలన్నదే దీని ఉద్దేశం. నెలకోసారి మీతో మాట్లాడే అదృష్టం నాకు కలిగింది. ప్రజల అభిప్రాయాలు ఫోన్లు, ఈ-మెయిళ్లు, సందేశాల ద్వారా అందిస్తున్నారు. ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చింది. నా చిన్నతనంలో రేడియో ద్వారానే అన్ని విషయాలు తెలుసుకునే వాడిని. అన్ని మాధ్యమాల కంటే రేడియో ప్రభావవంతంగా పనిచేస్తుందనేది నా నమ్మకం. మారుమూల పల్లెలకు సైతం రేడియో వినిపించగలదు’’ అని ప్రధాని పేర్కొన్నారు.

NATIONAL NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article