మోడీ మరో సంచలన నిర్ణయం

Modi Sensational Decisions.. ఆర్ధిక సంవత్సరం మార్పు

దేశంలో ఎన్డీయే పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఎవరూ తీసుకోని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు మోడీ ప్రభుత్వంపై చాలా వ్యతిరేకతను తీసుకొచ్చాయి. మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలను కలిగించింది అనేది పక్కన పెడితే పేద, మధ్యతరగతి ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందులు కలిగించింది. దేశంలో మరే ప్రభుత్వం తీసుకొని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సంస్కరణల విప్ అడుగు వేస్తున్న బీజేపీ సర్కార్ ఇప్పటికే దేశవ్యాప్త వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో బిజెపి ని ఓడించే లక్ష్యంతో బీజేపీయేతర కూటమి పురుడుపోసుకుంది. మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం రెడీ అవుతోంది.
మోడీ ప్రభుత్వం త్వరలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందా..? ఆర్థిక సంవత్సరాన్ని మార్చే యోచనలో ఉందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం అమలవుతోంది. దీనిని జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు 12 నెలల కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా మార్పు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పత్తుల కాలాలకు అనుగుణంగా ఉండాలని లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా మార్పుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది జరిగిన నీతీ ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలన్న ప్రస్తావన వచ్చింది. అప్పట్లో దీన్ని ముఖ్యమంత్రులను సమర్ధించినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ నిర్ణయాన్ని ఎంతమంది స్వాగతిస్తారో, ఎందరు వ్యతిరేకిస్తారో తెలీదు. ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయం వల్ల సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అనేది కూడా తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ నిర్ణయం వెనుక ఏదైనా రాజకీయ కారణాలున్నాయా అన్న కోణంలో కూడా ప్రతిపక్షాల ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి మోడీ సర్కార్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే అది పార్టీని వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులకు గురి చేయకుండా ఉంటుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article