మోడీకి కేసీఆర్ మీద కోపం వచ్చిందా?

247
MODI SERIOUS ON KCR

MODI SERIOUS ON KCR

మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి విషయం కక్కారు. తలుపులు మూసేసి, ఇరు రాష్ట్రాల నాయకులను సంప్రదించకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని మోడీ రాజ్యసభ అనడం ఒక్కసారిగా తెలంగాణ వాదుల్లో కలకలం రేగింది. అయితే, ఈ విషయాన్ని ఆయన కావాలనే అన్నారా? లేక తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారా? అనేది ఆయనకే తెలుసు. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రతిపక్ష నేత కూడా కాదు. కనీసం ఎంపీ కూడా కాదు. అలాంటిది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి ఏ పరిస్థితుల్లో బిల్లు  ఆమోదించాల్సి వచ్చిందో ఆయనకు స్వయంగా తెలియదు. అలాంటప్పుడు, మోడీ గతంలో లోక్ సభలో ప్రస్తుతం రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి అభ్యంతర వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదని తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. అయితే, మోడీ ఇలా అనడానికి గల కారణాలను విశ్లేషిస్తే..

ఇటీవల తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కేసీఆర్ పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి మోడీపై నిప్పులు చెరిగారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని, అధికారంలో ఉన్నవాళ్లకు ఫాల్స్ ప్రెస్టీజ్ ఉండకూడదని, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేస్తున్నారంటే మోడీపై నిప్పులు చెరిగారు. అలా జరిగితే, భారతదేశానికి అంతర్జాతీయంగా ఉన్న విలువ పడిపోతుందని వ్యాఖ్యానించారు. పైగా, కొంతకాలం నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి మోడీ మధ్య సయోధ్య లేదు. ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. బడ్జెట్ విషయంలో కూడా తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. అంతేకాదు, ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఏకాతాటిపైకి తీసుకొస్తారని చెప్పారు. మోడీ ఆగ్రహానికి ఇదీ కారణమైన ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ గనక ఇలా చేస్తే.. తన పీఠానికే ఎసరొస్తుందని ప్రధానమంత్రి అర్థం చేసుకుని ఉంటాడు. అందుకే, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతూ ఆయన మాట్లాడారని అనిపిస్తుంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ సమర్థించింది. లోక్ సభలో సుష్మా స్వరాజ్, రాజ్యసభలో అరుణ్ జైట్లీలు కలిసి బిల్లుకు అనుకూలంగా మాట్లాడి సమర్థించిన విషయం ప్రధానమంత్రి హోదాలో ఉండి మోడీ మర్చిపోతే ఎలా? ఏదీఏమైనా మోడీ వ్యాఖ్యలు తెలంగాణలో వేడిని పుట్టించాయి. ఇప్పటికైనా, దీనిపై తెలంగాణ రాష్ట్రం స్పందిస్తుందో లేదో చూడాలి.

MODI VS KCR

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here