Modi tweeted on Ayodhya verdict
వివాదాస్పద అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించనున్నది. శనివారం (నవంబర్9వ తేదీన) ఉదయం 10.30 నిమిషాలకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడించనున్నది. ఈ బృందంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ ఈ బృందంలో ఉన్నారు. అయోధ్య-బాబ్రీ మసీదు భూ వివాదంపై తుది తీర్పు వెలువడుతుండటంతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొన్నది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించినా దానిని ఏ ఒక్క వర్గానికో గెలుపు? ఓటమి అనే కోణం నుంచి చూడకూడదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు మనవి చేశారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను మనం చక్కగా కాపాడుకోవాలని, సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగినంత కాలం సమాజంలోని అన్ని వర్గాలు సుహృద్భావవ పరిస్థితులు కొనసాగించారని, తీర్పు తరువాత అన్ని వర్గాలు అలాగే శాంతియుతంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు మనవి చేశారు.
tags: Supreme Court Ayodhya verdict, Supreme Court, central government, Ranjan Gagoi, Chief Justice Of India, pm moditweet, twitter
https://tsnews.tv/amith-shah-meets-national-security-advisor-ajit-dhawal/