కేసీఆర్ ఫ్రంట్ గురించే మోడీ కి తెలీదట

నూతన సంవత్సర ఆగమనం తో అందరూ సంతోషంగా ఉంటె ప్రధాని మోదీ చిట్ చాట్ తో షాక్ ఇచ్చారు. ప్రజలందరూ అవాక్కయ్యే నిజాలు చెప్పారు. మోడీ లో ఈ కోణం కూడా ఉందా అని జనాలు తెల్లబోయారు. ఇక మోడీ చెప్పిన నిప్పు లాంటి నిజం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివెయ్యండి.

తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇక ఆ ఫెడరల్ ఫ్రంట్ కూడా బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి అని చెపారు. దీంతో చంద్రబాబు అది బీజేపీ కోసం అధికార పార్టీ గా వున్నా బీజేపీ ని వ్యతిరేకించే కూటమి చీలిక లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న కూటమి అని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ వల్ల బీజేపీకి లాభం జరుగుతోంది అని కూడా చెప్పుకొచ్చారు. ఇది పక్కా మోడీ ప్లాన్ అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక కేసీఆర్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ కోసం పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిశారు. కొంత విరామం తీసుకుని మరికొందరిని కలవనున్నారు. అలాగే, జాతీయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఢిల్లీలో శాశ్వత అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని జరుగుతున్నా.. ఈ విషయాలేమీ భారత ప్రధాని మోదీకి తెలియవట.

కొత్త సంవత్సరం వేళ ప్రధాని మోడీ పెద్ద జోక్ పేల్చారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మోదీ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇందులో పలు అంశాలను ప్రసావించారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న మహాకూటమి గురించి మాట్లాడారు. ‘‘అసలు మహాకూటమి అనే మాటకే అర్థం లేదు. ఒక వ్యక్తి లక్ష్యంగా పార్టీలన్నీ ఏకమవుతాయా?. ఇలాంటి రాజకీయాన్ని జనం తిప్పికొడతారు. ఇది దేశం వర్సెస్‌ మహాకూటమి. తెలంగాణలో మహాకూటమి గతి ఏమైంది. అసలు మహాకూటమిపై చర్చించాల్సిన అవసరం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసమే నాయకులు ఏకమవుతున్నారు’’ అంటూ కూటమిపై సెటైర్లు గుప్పించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి స్పందిస్తూ ‘‘కేసీఆర్ ఒక కూటమి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు నాకు తెలియదు. ఆయన కూటమి గురించి ఇప్పటి వరకు ఆలోచించలేదు’’ అంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి ప్రధానికి చీమ చిటుక్కుమన్నా ఇట్టే చెప్పేసే నిఘా సంస్థలు అందుబాటులో ఉంటాయి. అలాంటిది కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాట్లు, ముఖ్యమంత్రులను కలవడం, ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం వంటి ఆ సంస్థలకు తెలిసిపోతుంది. కానీ, మోదీ మాత్రం తెలియదని చెప్పడం మాత్రం అందరినీ నివ్వెరపరుస్తుంది.

PM MODI, NARENDRA MODI

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article