జీహెచ్ఎంసీ కోసం నగరానికి మోడీ?

Modi Visit Hyd on 28th

ఈనెల 28 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్లో పర్యటిస్తారు. ప్రత్యేక విమానంలో ఆయన హకీంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి భారత్ బయోటెక్ సందర్శిస్తారు. కరోనా వ్యాక్సిన్ పరిశోధనల పురోగతి పరిశీలిస్తారు. పనిలో పనిగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పనితీరును తెలుసుకుంటారు. టీఆర్ఎస్ ను ఓడించడానికి అవసరమయ్యే విధంగా పార్టీని దిశానిర్దేశం చేస్తారని సమాచారం. పనిలో పనిగా ఇదే సమయంలో కొందరు పేరున్న నాయకులు బీజేపీ కండువా కప్పుకునే అవకాశమూ ఉందని తెలిసింది. మొత్తానికి, గ్రేటర్ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో సరికొత్త కలవరం రేపుతున్నాయి. మరి, ఆ రోజు మోడీ తెలంగాణ బీజేపీని ఎలా దిశానిర్దేశం చేస్తారో? ఎలాంటి వ్యూహాన్ని పార్టీ శ్రేణులకు చెబుతారో అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారనున్నది.

GHMC ELECTIONS LIVE 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *